Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. అనికేత్ ఒంటరి పోరాటం... డీసీ లక్ష్యం ఎంతంటే?

Delhis Bowling Dominates Anikets Lone Fight DCs Target
Advertisement
  • 18.4 ఓవర్లలో 163 పరుగులకు హైదరాబాద్ ఆలౌట్
  • 5 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్
  • అనికేత్ పోరాటంలో గౌరవప్రదమైన స్కోరు సాధించిన హైదరాబాద్
Advertisement
విశాఖపట్నంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు వణికిన హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 163 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు కలిసి రాలేదు. 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో అనికేత్‌వర్మ, క్లాసెన్ ఇద్దరూ ఆపద్బాంధవులయ్యారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్‌గా క్లాసెన్ పెవిలియన్ చేరిన తర్వాత వికెట్ల పతనం మరోమారు మొదలైంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ పోటీలు పడి వికెట్లు తీశారు. స్టార్క్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

మరోవైపు, వికెట్లు పడిపోతున్నా అనికేత్ మాత్రం ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసిన అనికేత్... కుల్దీప్ యాదవ్‌కు చిక్కి ఎనిమిదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు వికెట్లు పడటానికి ఎంతో సమయం పట్టలేదు. అనికేత్ ఒంటరిపోరాటంతో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 
Advertisement
Advertisement
Aniket Varma
Sunrisers Hyderabad
Delhi Capitals
IPL 2023
Mitchell Starc
Kuldeep Yadav
Visakhapatnam
cricket
T20 cricket
IPL match

More Telugu News